![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -218 లో... శకుంతల తన పనులు తనే చేసుకుంటుంటే వీరు వచ్చి.. ప్రమీల మీ మాట విన్నప్పుడు మీకు సాయంగా ఉండేది కానీ ఇప్పుడు బిజినెస్ అప్పగించారు. మీ చెయ్ దాటి పోయిందని మీ మాట లెక్కచెయ్యడం లేదని వీరు అనగానే శకుంతలకి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మరొకవైపు ప్రమీల గుడికి వెళ్తుంది. అక్కడ ప్రసాదం కోసం లైన్ లో ఉండగా ఒకతను వచ్చి ప్రమీలతో మాట్లాడి ప్రసాదం తీసుకుంటాడు. అందులో జీడీపప్పు వస్తుంది. అది చూసి మీరు నాకు చాలా లక్కీ అండి.. ప్రసాదంలో జీడిపప్పు వచ్చిందని అంటాడు. ప్రమీల వెళ్లేసరికి ప్రసాదం అయిపోతుంది. దాంతో మనం షేర్ చేసుకుందామని అతను అంటాడు. ప్రమీల వద్దని అంటుంది. ప్రసాదం అలా వద్దని అనుకూడదని అతను అంటాడు. దాంతో ప్రసాదం ప్రమీల తీసుకుంటుంది.
మరొకవైపు పైడిరాజు, లక్ష్మీ ఇద్దరు గుడికి వచ్చి రంగాకి నిజం తెలియకూడదని మొక్కుంటారు. అప్పుడే రంగా వస్తాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పండి అని రంగా అనగానే ఏంటి అది అని లక్ష్మీ అంటుంది. గంగ మీ కూతురు కాదు కదా అని రంగా అంటాడు. దాంతో గంగ మా కూతురే అని లక్ష్మీ అంటుంది. అయితే దేవుడి మీద ఒట్టు వెయ్యమని రంగా అనగానే లక్ష్మీ వెయ్యదు. గంగ మా కూతురు కాదని లక్ష్మీ అంటుంది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. మాకు గంగ అంటే చాలా ఇష్టం ఎప్పుడు గంగ మాతోనే ఉండాలని లక్ష్మీ అంటుంది. అప్పుడే గంగ ఎంట్రీ ఇస్తూ.. ఎప్పుడు మీతోనే ఉంటానని గంగ అంటుంది. అదంతా విందేమోనని కంగారుపడుతారు కానీ అది ఏం వినదు. ఆ తర్వాత రంగా, గంగ ఇద్దరు లక్ష్మి, పైడిరాజుతో మాట్లాడి గుడి లోపలికి వెళ్తారు.
అక్కడ ప్రమీల తనకి ప్రసాదం ఇచ్చిన అతనితో మాట్లాడుతుంటే గంగ, రుద్ర నవ్వుకుంటారు. మరొకవైపు బావ నువ్వు ఈ ఫ్యామిలీ కోసం బాగా కష్టపడుతున్నావ్.. ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నావ్ అంటాడు. అవును నా కుటుంబం జోలికి ఎవరు వచ్చిన ఊరుకోను కదా వీరు అని రుద్ర అంటాడు. తరువాయి భాగంలో ప్రమీల గుడికి వెళ్ళిందని పెద్దమ్మ లైట్ తీసుకోవచ్చు కానీ అలా తీసుకోలేదంటే తనకి ఎవరో నూరిపోశారని వీరుని ఉద్దేశ్యించి రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |